తలసేమియా బాధితులకు అండగా ఉండండి

ABN , First Publish Date - 2021-07-30T06:34:41+05:30 IST

తలసేమియా బాధితులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాకినాడ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ చెప్పారు. రక్తదాన శిబిర పోస్టర్‌ను గురువారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు.

తలసేమియా బాధితులకు అండగా ఉండండి
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

  • ప్రతిఒక్కరూ రక్తదానం చేయండి: ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పిలుపు

భానుగుడి(కాకినాడ), జూలై 29: తలసేమియా బాధితులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాకినాడ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇన్‌చార్జి కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ చెప్పారు. రక్తదాన శిబిర పోస్టర్‌ను గురువారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గుతున్నాయనే విషయాన్ని యువత దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రక్తం అవసరమవుతుందని, చిన్నారులను ఆదుకోవడం కోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనాలన్నారు. సేవా సమితి సభ్యులు హసన్‌షరీఫ్‌, అలీమ్‌, నవసుందర్‌, ఆసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:34:41+05:30 IST