Abn logo
Sep 18 2020 @ 12:36PM

ఆదాశ‌ర్మ 'క‌్వ‌శ్చన్ మార్క్ 'పోస్ట‌ర్ లాంచ్‌

Kaakateeya

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ హీరోయిన్‌గా విప్రా దర్శకత్వంలో  గౌరీ కృష్ణ నిర్మిస్తోన్న చిత్రం 'క్వశ్చన్ మార్క్'. ఈ చిత్రం పోస్ట‌ర్‌ను శుక్రవారం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...క‌రోనా వల్ల ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌రువైంది. ఇలాంటి త‌రుణంలో ఒక‌ మంచి మెసేజ్‌తో వ‌స్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరోయిన్‌కు, ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని అన్నారు.


నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ "క‌రోనా టైమ్‌లో ప్రారంభించి షూటింగ్ ఫినీష్ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాశ‌ర్మ ఎంతగానో సహకరించారు. త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేస్తాం" అన్నారు. ద‌ర్శ‌కుడు విప్రా మాట్లాడుతూ "త‌ల‌సానిగారు మా సినిమా పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీ. క‌రోనా టైమ్‌లో మా సినిమా షూటింగ్‌కి స‌హ‌క‌రించిన ఆదాశ‌ర్మగారికి మా నిర్మాత గౌరీకృష్ణ గారికి ధ‌న్య‌వాదాలు. 'క్వ‌చ్చ‌న్ మార్క్' టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా చూస్తే ఈ టైటిల్ యాప్ట్ అంటారు. అంద‌రికీ న‌చ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు. ఆదాశ‌ర్మ మాట్లాడుతూ "క‌రోనా టైమ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధ‌మవుతోన్న ఫ‌స్ట్ సినిమా మాదే అనుకుంటా. సినిమా చాలా బాగా వ‌చ్చింది, నా పాత్రకు నేనే డ‌బ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ఇద్ద‌రు డైర‌క్ట‌ర్స్ ఈ సినిమా చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ ప‌ర్స‌న్స్. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెస్తుంది" అన్నారు.


Advertisement
Advertisement
Advertisement