సినిమా షూటింగ్‌లపై త్వరలో సీఎం నిర్ణయం: తలసాని

ABN , First Publish Date - 2020-05-27T09:37:31+05:30 IST

రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు ఇతర అంశాలపై త్వరలో నిర్ణయం

సినిమా షూటింగ్‌లపై త్వరలో సీఎం నిర్ణయం: తలసాని

సికింద్రాబాద్‌/మారేడుపల్లి, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు ఇతర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని చెప్పారు. ప్రధానంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌, షూటింగ్‌ల నిర్వహణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించి, దశలవారీగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కళాకారులు, టీవీ ఆర్టిస్టులు చాలా మంది అవస్థలు పడుతున్నందున వారిని ఆదుకోవాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపా రు.


దీనిలో భాగంగా తలసాని ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం 14వేల మందికి బియ్యం, పప్పు, చక్కెర, పండ్లు తదితర 8 రకాల సరుకుల కిట్స్‌ పంపిణీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు మారేడుపల్లి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాలులో జరుగుతున్న నిత్యావసరాల కిట్స్‌ ప్యాకింగ్‌ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు కాదంబరి కిరణ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అత్తెల్లి శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T09:37:31+05:30 IST