Jun 23 2021 @ 00:50AM

తలైవికి సెన్సార్‌ అనుమతి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎ. ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని భావించినా కరోనాతో వాయిదాపడింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘తలైవి’ తమిళ వెర్షన్‌కు సెన్సార్‌ అనుమతి లభించింది. దీనికి క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ జారీ చేశారు. తెలుగు, హిందీ వెర్షన్‌లకు సెన్సార్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో ఎమ్జీయార్‌గా అరవింద్‌స్వామి, కరుణానిధిగా సముద్రఖని, జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ, జానకీ రామచంద్రన్‌గా మధుబాల నటించారు. విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మాతలు.