నల్గొండ జిల్లా: ఉద్యోగాల పేరిట దందా...

ABN , First Publish Date - 2021-12-13T16:53:43+05:30 IST

ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశారు.

నల్గొండ జిల్లా: ఉద్యోగాల పేరిట దందా...

నల్గొండ జిల్లా: ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశారు. సుమారు 70 మంది నుంచి రూ. ఒక కోటి 50 లక్షలు వసూలు చేశారు. సూర్యాపేట జిల్లా, కోదాడ మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరుతో దందా జరిగింది. డబ్బులు తీసుకుని రెండు నెలలు అవుతున్నా.. నియామకాలు జరగకపోవడం.. ఛైర్ పర్సన్ భర్తకు, అధికార పార్టీ కౌన్సిలర్లకు పొసగకపోవడంతో విషయం బయటకొచ్చింది. 


ఇక కోదాడ మున్సిపాలిటీలో రెండు నెలల కిందట ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల కోసం టెండర్లను ఆహ్వానించారు. 70 మంది కామాటీలు, 27 మంది డ్రైవర్లను నియమించాలని పాలకవర్గం నిర్ణయించగా ఒక్కొరిదగ్గర నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశారు. కానీ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపై సామాజిక కార్యకర్త జలగం సుధీర్ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2021-12-13T16:53:43+05:30 IST