వ్యాక్సిన్‌ వేయించుకుని స్ఫూర్తి నింపండి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-02-25T05:56:31+05:30 IST

పోలీసులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.

వ్యాక్సిన్‌ వేయించుకుని స్ఫూర్తి నింపండి: ఎస్పీ
కర్నూలులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఎస్పీ ఫక్కీరప్ప

  1. వ్యాక్సిన్‌ వేయించుకున్న డీఐజీ, ఎస్పీ, సిబ్బంది


 కర్నూలు, ఫిబ్రవరి 24: పోలీసులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప, పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, రాజీవ్‌ కుమార్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కరోనా వైరస్‌ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని ఎస్పీ అన్నారు. సెకండ్‌ వేవ్‌ వచ్చి లాక్‌డౌన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే వ్యాక్సిన్‌ వేసుకుని పోలీసులు విధి నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ రాధాక్రిష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ మహేశ్వరరెడ్డి, రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా, పోలీసు వెల్ఫేర్‌ డా.స్రవంతి, ఆర్‌ఐలు సురేంద్రారెడ్డి, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:56:31+05:30 IST