ఈ జాగ్రత్తలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-07-13T09:19:53+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి టెక్సస్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కొన్ని

ఈ జాగ్రత్తలు తీసుకోండి

అమెరికాలో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి టెక్సస్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలు ఏవంటే..


తక్కువ రిస్క్‌ ఉన్నవి..

  1. రెస్టారెంట్ల నుంచి ఆహారం తీసుకెళ్లడం
  2. పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం పోయించుకోవడం
  3. టెన్నిస్‌ ఆడడం, క్యాంపులకు వెళ్లడం


ఓ మోస్తరు తక్కువ రిస్క్‌ ఉన్నవి

  1. సరుకుల కోసం షాపింగ్‌కు వెళ్లడం-3
  2. వాకింగ్‌, జాగింగ్‌కు వెళ్లడం, ఇతరులతో కలిసి బైక్‌
  3. రైడింగ్‌కు వెళ్లడం, గోల్ఫ్‌ ఆడడం3
  4. రెండు రోజుల పాటు హోటల్‌లో ఉండడం
  5. వైద్యుడి నిరీక్షణ గదిలో వేచిచూడడం
  6. గ్రంథాలయం, మ్యూజియంకు వెళ్లడం
  7. రెస్టారెంట్‌లో భోజనం చేయడం
  8. జనసమ్మర్దక ప్రాంతంలో నడవడం
  9. ఆటస్థలాల్లో గంటపాటు గడపడం


ఓ మోస్తరు రిస్క్‌ ఉన్నవి

  1. ఒకరి ఇంట్లో భోజనం చేయడం
  2. విందు భోజనాలకు వెళ్లడం
  3. బీచ్‌లకు వెళ్లడం, మాల్‌లో షాపింగ్‌ చేయడం
  4. పిల్లలను బడులకు, సంరక్షణ కేంద్రాలకు పంపడం
  5. ఆఫీసు భవనంలో వారం పాటు పనిచేయడం
  6. వృద్ధులు లేదా స్నేహితుల ఇళ్లను దర్శించడం


ఎక్కువ రిస్క్‌ ఉన్నవి

  1. సెలూన్‌ షాప్‌కు వెళ్లడం, 
  2. రెస్టారెంట్‌లో భోజనం చేయడం
  3. శుభకార్యాలు, అంత్యక్రియలకు హాజరుకావడం
  4. విమానాల్లో ప్రయాణించడం, బాస్కెట్‌బాల్‌ ఆడడం
  5. ఫుట్‌బాల్‌ ఆడడం, కౌగిలింతలు, కరచాలనాలు చేయడం


మరీ ఎక్కువ రిస్క్‌ ఉన్నవి

  1. బఫేలో భోజనం చేయడం
  2. జిమ్‌లో వ్యాయామం చేయడం
  3. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళ్లడం
  4. థియేటర్‌కు వెళ్లడం
  5. సంగీత కచేరీలకు హాజరుకావడం
  6. క్రీడా మైదానానికి వెళ్లడం
  7. 500 మంది కన్నా ఎక్కువ మందితో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడం, బార్‌కు వెళ్లడం

Updated Date - 2020-07-13T09:19:53+05:30 IST