ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

ABN , First Publish Date - 2022-08-04T05:22:07+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పిలు పునిచ్చారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో నరసన్నపేట, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, టెక్కలి పట్టణ టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి
మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తిలతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టెక్కలి/పాతపట్నం, ఆగస్టు 3:
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పిలు పునిచ్చారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో నరసన్నపేట, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, టెక్కలి పట్టణ టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలిపారు. దోచుకోవడమే అజెండాగా పాలన సాగిస్తోందని, వైసీపీ నేతల కనుసన్నల్లో మద్యం మాఫియా జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని.. ప్రశ్నిస్తే కేసులు, వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. విద్యుత్‌ ట్రూఆఫ్‌ చార్జీలు పేరిట మరో బాదుడుకు సన్నద్ధమవుతోందన్నారు. పెరిగిన డీజల్‌, పెట్రోల్‌ ధరలు మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమం క్షేత్రస్థాయిలో  ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదేస్ఫూర్తితో ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం, గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బూత్‌స్థాయిలో కష్టబడి పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. టెక్కలి పట్టణంలో బూత్‌ కన్వీనర్లు, యూనిట్‌ కోఆర్డినేటర్లు నియమించి పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జి, బగాది శేషగిరి, మట్ట పురు షోత్తం, ప్రీతీష్‌, లవకుమార్‌, కామేసు, రాము, వెంకటరెడ్డి, లాడి శ్రీనివాస్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-08-04T05:22:07+05:30 IST