కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలు స్వీకరించాలి

ABN , First Publish Date - 2022-05-27T05:38:05+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వపు వైభవం తీసుకొచ్చేందుకు బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు కోరారు.

కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలు స్వీకరించాలి
మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు

 మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి

గణపవరం, మే 26: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వపు వైభవం తీసుకొచ్చేందుకు బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు కోరారు. జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథరావు కుమారుడి వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పార్టీ బాధ్యతలు స్వీకరించాలని పలువురు కోరామని హరికుమార్‌ రాజు తెలిపారు. గురు వారం గణపవరం మండలం పిప్పర పార్టీ కార్యాలయంలో ఈ మేరకు హరికుమార్‌ రాజు విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతా నికి ప్రజలంతా తమ నాయకత్వ్తం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు మాజీ ముఖ్యమంత్రిగా మీకే ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పాలన పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని, ప్రత్యామ్నాయ పార్టీల వైపు ప్రజల దృష్టి మళ్ళిందని, ఇటువంటి తరుణంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరామనిఅన్నారు.  


Updated Date - 2022-05-27T05:38:05+05:30 IST