ఓపీ పెంచేందుకు చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-02-28T05:44:29+05:30 IST

చినమేరంగి సీహెచ్‌సీని జిల్లా ఆస్పత్రుల సమన్వ యకర్త (డీసీహెచ్‌ఎస్‌) జి.నాగ భూషణరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఓపీ పెంచేందుకు చర్యలు తీసుకోండి

జియ్యమ్మవలస: చినమేరంగి సీహెచ్‌సీని జిల్లా ఆస్పత్రుల సమన్వ యకర్త (డీసీహెచ్‌ఎస్‌) జి.నాగ భూషణరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఐపీ, ఓపీ పెంచేందుకు తగు చర్యలు తీసుకో వాలని హెడ్‌ నర్సు ఎన్‌.పార్వతికి ఆదేశించారు. ఆస్పత్రిలో సర్జరీలు ప్రారంభించాలని వైద్యాధికారిణి సీహెచ్‌ కమలకుమారికి సూచించా రు. ప్రస్తుతం గ్రేడ్‌-సీలో ఉన్న ఈ ఆస్పత్రి ర్యాంకు మెరుగు పడాలన్నారు. ఆస్పత్రికి ప్రహరీ లేదని, అలాగే స్కానర్‌ పాడైందని కమలకుమారి డీసీహెచ్‌ఎస్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రహరీ మంజూరు కావడాని కి సమయం పడుతుందని, తాత్కాలికంగా  హెచ్‌డీఎస్‌ నిధులతో ఇనుప కంచె ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్కానర్‌ను అతి త్వరగా మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల జీతాల ప్రస్తావన ఆయన దృష్టికి తీసుకురాగా, డిసెంబరు వరకు జీతాలు చెల్లించేలా ఐదు రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యశ్రీ బకాయిల పెండిం గ్‌ విషయంపై ఆయన ఆరా తీసి, నివేదికను సమర్పించాలని ఆదేశించారు. 

 

Updated Date - 2021-02-28T05:44:29+05:30 IST