Abn logo
Apr 3 2020 @ 09:00AM

అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోండి

సీఎం జగన్‌కు ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): అందరికీ పెన్షన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు గురువారం ట్వీట్‌ చేశారు. జిల్లాలోని ఇతర మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలామంది లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయారని, వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


Advertisement
Advertisement
Advertisement