‘టేక్‌ డైవర్షన్‌’.. అలరిస్తున్న దేవా పాట

శివానీ సెంథిల్‌ దర్శకత్వంలో ‘టేక్‌ డైవర్షన్‌’ అనే పేరుతో ఓ ప్రేమ కథాచిత్రం రూపొందుతోంది. కేవలం 80, 90 దశకాల్లోనే కాకుండా 2కేలో కూడా బాల్యాన్ని అధిగమించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చేలా తెరకెక్కించినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రం కోసం ప్రముఖ సీనియర్‌ సంగీత దర్శకుడు దేవా ఓ గానా పాటను పాడారు. ఇది సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది నెటిజన్లు ఈ పాటను వీక్షించారు. ఈ పాటకు ‘బిగ్‌ బాస్‌’ ఫేం కొరియోగ్రాఫర్‌ శాండి నృత్యం సమకూర్చారు. 


అలాగే, ‘టేక్‌ డైవర్షన్‌’ చిత్రంలో ‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించగా, శివకుమార్‌ అనే యువకుడు తొలిసారి హీరోగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్‌గా పాటినీకుమార్‌, రెండో హీరోయిన్‌గా గాయత్రి నటిస్తున్నారు. జాన్‌ విజయ్‌ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ టీవీ ఫేం జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఈశ్వరన్‌ తంగవేల్‌. చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


Advertisement