మమ్మల్ని.. పట్టించుకోవాలి

ABN , First Publish Date - 2021-04-16T06:19:52+05:30 IST

ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రైవేట్‌గా పని చేస్తున్న మమ్మల్నీ కూ డా జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవాలని జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉ పాధ్యాయులు కలెక్టరేట్‌కు తరలివ చ్చారు.

మమ్మల్ని.. పట్టించుకోవాలి

 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పని చేస్తున్న ప్రైవేట్‌ టీచర్ల వినతి

కామారెడ్డిటౌన్‌, ఏప్రిల్‌ 15: ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రైవేట్‌గా పని చేస్తున్న మమ్మల్నీ కూ డా జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవాలని జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉ పాధ్యాయులు కలెక్టరేట్‌కు తరలివ చ్చారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జిల్లాలో 100 మంది వరకు ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పని చేస్తున్నామని, కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడడంతో త మ బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. తమ ఆకలి కేకలను తీర్చేనాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యకం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహయం దరఖాస్తుకు చివరి రోజు కావడంతో తమ కూ అవకాశం కల్పించాలని కోరారు. కేవలం యూడై స్‌ లిస్టులో ఉన్న వారి నుంచి మాత్రమే దరఖా స్తులు తీసుకుంటున్నారని, తమ పేర్లను యూడైస్‌ జాబితాలో చేర్చకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపో తున్నామని తెలిపారు. ఎంఈవోలను అడిగితే ప్రభు త్వం నుంచి మీ దరఖాస్తులు తీసుకోవాలని ఎలాం టి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. తమకు ఆర్థిక సహయం అందేలా చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివా స్‌, గణేష్‌, నరేష్‌; రవి, స్రవంతి, కల్పన, మయూరి, దివ్య,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:19:52+05:30 IST