అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి

ABN , First Publish Date - 2022-06-28T04:55:01+05:30 IST

కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.

అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

 సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ డిమాండ్‌


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 27: కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ ఆధ్వర్యంలో నాయకులు దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, దేవులపల్లి యాదగిరి, పూజల హరికృష్ణ, సూర్యవర్మ, గూడూరు శ్రీనివాస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్నిపథ్‌ పథకాన్ని తెచ్చి దేశ భద్రతను చీకట్లోకి నెట్టారన్నారు. అవగాహన రాహిత్యంతోనే మోదీ సర్కార్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. అదానీ, అంబానీ కంపెనీలకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో దేశ భద్రతను పణంగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, రాములు, బర్మా రామచంద్రం, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, దాస అంజయ్య, కలీముద్దీన్‌, నాయిని నర్సింహారెడ్డి, మార్క సతీ్‌షగౌడ్‌, వహాబ్‌, షాబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


బీజేపీ.. దేశద్రోహ పార్టీ: శ్రీనివాస్‌రెడ్డి


దుబ్బాక, జూన్‌ 27: ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ, ఆదానీ, అంబానీలకు దేశాన్ని ధారాదత్తం చేస్తున్న బీజేపీ దేశద్రోహ పార్టీ అని కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. దుబ్బాకలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ దేశంలో ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి, ఎనిమిదేళ్లలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దేశ రక్షణ రంగాన్నీ కూడా అదానీ, అంబానీ చేతుల్లో పెట్టడానికి అగ్నిపథ్‌ను తీసుకుని వచ్చారన్నారు. ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే, ఇద్దరు గుజరాతీలు దేశరంగ సంస్థలను కొంటున్నారన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులకు వంచన: శ్రీరాంచక్రవర్తి


హుస్నాబాద్‌: ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను కేంద్ర ప్రభుత్వం వంచించిందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి అన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో చేపట్టిన సత్యగ్రహ దీక్షలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మ శ్రీరాంచక్రవర్తి మాట్లాడారు. దేశ భద్రతను కాంట్రాక్టుకు ఇస్తారా అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, జిల్లా కార్యదర్శులు ఎండి హసన్‌, చిత్తారి రవీందర్‌, యాదవరెడ్డి, అశోక్‌రెడ్డి, మల్లేశం, బస్వారాజు శంకర్‌, రవీందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, రాజు, అక్కు శ్రీనివాస్‌, మండలాల అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, బంక చందు, మంద ధర్మయ్య, గుండారపు శ్రీనివాస్‌, కంది తిరుపతిరెడ్డి, ఉసకోయిల ప్రకాష్‌, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, స్వర్ణలత, సరోజన, వల్లపు రాజు, ఎగ్డిడి అయిలయ్య, ప్రభాకర్‌, పచ్చిమట్ల రాధ, గాజుల చంద్రయ్య, వెన్న రాజు, సది, వెంకట్‌ పాల్గొన్నారు.


చేర్యాలలో


చేర్యాల: చేర్యాలలో అంబేడ్కర్‌ విగ్రహావరణలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వకులాభరణం నర్సయ్యపంతులు మాట్లాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు ఆది శ్రీనివాస్‌, బండి శ్రీనివాస్‌, బుడిగె గురువయ్య, బ్లాక్‌కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్‌, లింగంపల్లి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కొమ్ము రవి, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్‌, కౌన్సిలర్‌ చెవిటి లింగం, కాటం శ్రీనివాస్‌, భూమిగారి జనార్ధన్‌, కూరపాటి మదుసూధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T04:55:01+05:30 IST