వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-27T04:41:19+05:30 IST

ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండంలోని రౌటసంకెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్‌ఆర్‌ కాలనీలో అడపీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితవైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారి స్తుందన్నారు.

వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోగులకు మందులను పంపిణీ చేస్తున్న జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 26: ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండంలోని రౌటసంకెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్‌ఆర్‌ కాలనీలో అడపీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితవైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారి స్తుందన్నారు. ఈసందర్భంగా గ్రామంలోని 120కుటుంబాలకు వైద్య పరీ క్షలను నిర్వహించారు. అవసర మైన వారికి మందులను ఉచి తంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌, వైద్యాధికారి సత్యనారాయణ, ఎంపీటీసీ సుశీల, సర్పంచ్‌ విమల, వైద్యఆరోగ్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:41:19+05:30 IST