వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-29T06:53:29+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్‌ రెగ్యులరై జేషన్‌ స్కీం, ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ పథకాలకు కేవలం మూడు రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ అవకాశాన్ని కరీంనగర్‌ ప్రజలు సద్వినియోగం

వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌పై అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు 

నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 28: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్‌ రెగ్యులరై జేషన్‌ స్కీం, ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ పథకాలకు కేవలం మూడు రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ అవకాశాన్ని కరీంనగర్‌ ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి విజ్ఞప్తి చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్‌ సునీల్‌రావు మాట్లా డుతూ ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటిసందేహాలు, అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. ఈనెల 31వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆస్తిపన్ను బకాయిలను ఈనెల 31లోగా చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు.


కమిషనర్‌ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ వడ్డీ మాఫీకి మూడురోజుల గడువు మిగిలి ఉండడంతో కార్పొరేషన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. నగర ప్రజలు ఆస్తిపన్ను బకాయిలను చెల్లించి వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, డిప్యూటీ సిటీప్లానింగ్‌ ఆఫీసర్‌ వై సుభాష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T06:53:29+05:30 IST