Abn logo
Jul 30 2021 @ 22:00PM

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు 

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 30: ప్రభుత్వం అంగ న్‌వాడీకేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహా రాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోం చేసుకోవా లని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తుంపల్లిలో చిరుధా న్యాలతో చేసిన వంటకాలను అంగన్‌వాడీకేంద్రంలో గర్భి ణులు, చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారు లకు చిరుధాన్యాలతో వంటలు చేసి అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. డీడబ్ల్యూవో సావిత్రి, డీఎంహెచ్‌ మనోహర్‌, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, సర్పంచ్‌వరలక్ష్మి, ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

- పరిసరాల పరిశుభత్రతోనే ఆరోగ్య రక్షణ..

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యరక్షణ అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం డ్రై డే పురస్కరించుకుని మండలంలోని తుంపల్లి గ్రామంలో గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు నివా రించవచ్చన్నారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌ రావు, సర్పంచ్‌ వరలక్ష్మి ఉన్నారు.