‘నైట్‌ కర్ఫ్యూ పాసులను సద్వినియోగం చేసుకోవాలి’

ABN , First Publish Date - 2022-01-29T04:59:27+05:30 IST

రాత్రిపూట ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం ఆటోలకు నైట్‌ కర్ఫ్యూ పాసులను జారీ చేశామని, వాటిని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని నగర డీఎస్పీ కేవీ మహేష్‌ సూచించారు.

‘నైట్‌ కర్ఫ్యూ పాసులను సద్వినియోగం చేసుకోవాలి’

కర్నూలు(న్యూసిటీ) జనవరి 28: రాత్రిపూట ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం ఆటోలకు నైట్‌ కర్ఫ్యూ పాసులను జారీ చేశామని, వాటిని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని నగర డీఎస్పీ కేవీ మహేష్‌ సూచించారు. శుక్రవారం సీఐటీయూ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నైట్‌ కర్ఫ్యూ పాసులను అందజేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎండి.అంజిబాబు, నాయకులు వై.సుధాకర్‌, హుసేన్‌, మళ్లి, రఘు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T04:59:27+05:30 IST