ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-03-03T04:48:51+05:30 IST

యువతి, యువకులు ఉద్యోగ అవ కాశాలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ ఏ.మురళీమనోహర్‌ తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరులోని స్త్రీశక్తి భవనంలో ఉద్యోగ అవకాశాలపై సమావేశం నిర్వహించా రు.

ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ మురళీమనోహర్‌

రైల్వేకోడూరు, మార్చి 2 : యువతి, యువకులు ఉద్యోగ అవ కాశాలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ ఏ.మురళీమనోహర్‌ తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరులోని స్త్రీశక్తి భవనంలో ఉద్యోగ అవకాశాలపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాక్స్‌ లింక్‌ ఇండియా ఎలకి్ట్రక్‌ కంపెనీ నందు ఉద్యోగాలు మహిళలకు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

ఉ పాధి కల్పన మరియు వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులతో ఈ నెల రైల్వేకోడూరులోని ఎంపీడీవో కార్యాలయం సభా భవనంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొన్నాలని కోరారు. అసిస్టెంట్‌ లీడర్‌, హెల్పర్స్‌ పోస్టులు మహిళలకు మాత్రమే ఉన్నాయన్నారు.

అసిస్టెంట్‌ లీడర్‌కు బీటెక్‌ (ఈఈఈ)ఈసీఈ) పాస్‌ అయి ఉండాలన్నారు. హెల్పర్స్‌కు టెన్త్‌ పాస్‌ అయి ఉండాలన్నారు. అసిస్టెంట్‌ లీడర్‌కు వేతనం రూ. 12వేలు, హెల్పర్స్‌కు రూ. 9319లు ఇస్తా మన్నారు.      ఇంటర్వ్యూలకు హజరు కావాల్సిన వారు విద్యా అర్హత సర్టిఫికెట్స్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఒరిజనల్‌తో పాటు జిరాక్స్‌లు, రెండు కలర్‌ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. ప్రస్తుతం అప్‌డేటెడ్‌ రెజూమ్‌ తీసుకుని రావాలన్నారు.

Updated Date - 2021-03-03T04:48:51+05:30 IST