ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-09-29T05:42:09+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా జౌళిశాఖ అభివృద్ధి అధికారి అనుమోలు వెంకటేశ్వరులు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
చేనేత కార్మికులకు సూచనలు ఇస్తున్న జిల్లా చేనేత అధికారి

నగరి, సెప్టెంబరు 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా జౌళిశాఖ అభివృద్ధి అధికారి అనుమోలు వెంకటేశ్వరులు పిలుపునిచ్చారు. నగరి మండల పరిధిలోని మాంగాడు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు వాటర్‌షెడ్‌ పథకం ద్వారా రూ.లక్షా 20 వేలు పూర్తి సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. మరమగ్గం కలిగి ఉండాలని, వర్క్‌షెడ్‌ నిర్మించడానికి స్థలం ఉండాలని, దరఖాస్తుదారుని పేరుపై ఇంటి పత్రాలు ఉండాలని, ఆధార్‌, చేనేత గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు. ముద్ర పథకంలో బ్యాంక్‌ ద్వారా చేనేత కార్మికులకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 20 శాతం మార్జిన్‌ మనీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో చేనేత కార్మిక యూనియన్‌ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందల బాలాజీ, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:42:09+05:30 IST