సహకార సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-03T05:14:01+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అందిస్తున్న సేవలను మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

సహకార సేవలను సద్వినియోగం చేసుకోవాలి
జగదేవ్‌పూర్‌ పీఏసీఎస్‌ వద్ద జెండాను ఎగురవేస్తున్న చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి

జగదేవ్‌పూర్‌, జూలై 2: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అందిస్తున్న సేవలను మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి అన్నారు. వందవ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శనివారం సహకార పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మెనేజర్‌ నాగభూషణం, సీఈవో గుర్రం రాములు, పీఎసీఎస్‌ డైరెక్టర్లు శ్రీనివా్‌సగౌడ్‌, వెంకట్‌నర్సు, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కొండపాక పీఏసీఎ్‌సలో సహకార దినోత్సవం

కొండపాక, జూలై 2: కొండపాక పీఏసీఎ్‌సలో శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆవరణలో పీఏసీఎస్‌ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్లు పాల కృష్ణయ్య, బూర్గుల సురేందర్‌రావు, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు బైరి ప్రతాప్‌రెడ్డి, సీఈవో రాజు, పీఏసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సే లక్ష్యం

మిరుదొడ్డి, జూలై 2: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మిరుదొడ్డి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజలింగారెడ్డి అన్నారు. శనివారం మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వందవ అంతర్జాతీయ సహకార సంఘం దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నర్సింహులు, సీఈవో రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:14:01+05:30 IST