అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-07-29T05:20:18+05:30 IST

నియోజకవర్గంలో గౌతు కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంతో వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో బుధవారం సీఐ శంకర రావుకు ఫిర్యాదు చేశారు.

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి
సీఐకి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

సీఐకి టీడీపీ నాయకుల ఫిర్యాదు

పలాస: నియోజకవర్గంలో గౌతు కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంతో వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో బుధవారం సీఐ శంకర రావుకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తలు అసభ్యకరమైన పదజాలం తో సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్ట లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పీరికట్ల విఠల్‌, బడ్డ నాగరాజు, జి.సూర్యనారాయణ, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు పాల్గొన్నారు.


 అసభ్యకర పోస్టింగ్‌లు తగదు

మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవిపై టీడీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టడం తగదని,  వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వైసీపీ మహిళా విభాగం నాయకులు  సీఐ ఎస్‌.శంకరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  నాయకులు బోర చంద్రకళ, బళ్ల రేవతి, పోతనపల్లి ఉమా కుమారితో పాటు చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కోత పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-07-29T05:20:18+05:30 IST