నకిలీ పోలీసుపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-07-25T05:47:21+05:30 IST

పోతనాపల్లి, కృష్ణాపురం జంక్షన్లలో హల్‌చల్‌ చే స్తున్న నకిలీ పోలీసును పట్టుకొని చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నకిలీ పోలీసుపై చర్యలు తీసుకోండి

శృంగవరపుకోట రూరల్‌: పోతనాపల్లి, కృష్ణాపురం జంక్షన్లలో హల్‌చల్‌ చే స్తున్న నకిలీ పోలీసును పట్టుకొని చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా శనివారం పలువురు మాట్లాడుతూ... ప్రతిరోజూ రాత్రి 9గంటల తర్వాత ఆ నకిలీ పోలీసు పలు చోట్ల గస్తీ పేరుతో వాహనదారుల ను అడ్డగించి దొరికినకాడికి దోచుకుంటున్నాడని, లేకుంటే స్టేషన్‌కు రావాలంటూ రికార్డులు తీసుకుని మాయమైపోతున్నాడని వాపోతున్నారు. రెండు రోజుల కింద ట పోతనాపల్లికి చెందిన కొంతమందిని ఆ నకిలీ పోలీసు అడ్డగించి స్టేషన్‌కు రా వాలని చెప్పగా... పదండంటూ వారు చెప్పడంతో తన వెనకే రావాలని ఆ నకిలీ పోలీసు బండివేసుకొని వేగంగా జామి వైపు వెళ్లిపోయాడని, వెంబడించినా దొరకకపోవడంగా అతడ్ని నకిలీ పోలీసుగా గుర్తించారన్నారు. గతంలో కృష్ణాపురం రోడ్డులో ఒక వ్యక్తి నుంచి బంగారం చైన్‌, సెల్‌ఫోన్‌, పోతనాపల్లి గ్రామం వద్ద ఒక వృద్ధుడి వద్ద ఫోన్‌, నగదు.. అదేదారిలో వెళ్తున్న తల్లీకొడుకుల వద్ద నగదు కొట్టేసినట్టు వారు తెలిపారు. వీటిలో రెండు ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఈ నకిలీ పోలీసు బారిన కాపాడాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ వద్ద ప్రస్తావించగా... ఎవరికీ భయపడొద్దని, వెంటనే 100కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో నిఘా ఉంచు తామని తెలిపారు.

 

Updated Date - 2021-07-25T05:47:21+05:30 IST