దర్గా స్థల ఆక్రమితులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-08-13T05:13:28+05:30 IST

కడప నగరంలోని జలాల్‌హజరత్‌ రాకిబ్‌షావలి బాబా దర్గా స్థలాన్ని అధికార పా ర్టీ నేతల సహకారంతోనే ఆక్రమణకు గురవుతోందంటూ దర్గా కమిటీ నిర్వాహకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

దర్గా స్థల ఆక్రమితులపై చర్యలు తీసుకోండి
నిరసన తెలుపుతున్న ముస్లింలు

కబ్జా వెనుక వైసీపీ నేతల హస్తం ఫ ఆందోళనకు దిగిన నిర్వాహకులు 

కడప(క్రైం), ఆగస్టు 12: కడప నగరంలోని జలాల్‌హజరత్‌ రాకిబ్‌షావలి బాబా దర్గా స్థలాన్ని అధికార పా ర్టీ నేతల సహకారంతోనే ఆక్రమణకు గురవుతోందంటూ దర్గా కమిటీ నిర్వాహకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షేక్‌ సలీమ్‌ బాషా మాట్లాడుతూ 1860 నుంచి దర్గా పూజా కార్యక్రమాలు దర్గాస్వామి గంధం, ఉరుసు భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. దర్గాకు చెందిన 5.75 సెంట్ల భూమిని ఆక్రమిస్తున్నారని తక్షణమే అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.



Updated Date - 2022-08-13T05:13:28+05:30 IST