కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి : ఏఐఎ్‌సఎఫ్‌

ABN , First Publish Date - 2021-07-28T05:41:35+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను దోపిడి చేస్తుందని ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి : ఏఐఎ్‌సఎఫ్‌
పెనుకొండ డీటీకి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

పెనుకొండ, జూలై 27: కరోనా కష్టకాలంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను దోపిడి చేస్తుందని ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, జిల్లా కార్యదర్శి అరుణ్‌రెడ్డి, నాయకులు నందీష్‌, లోక్‌నాథ్‌, వేణు, ఆధ్వర్యంలో విద్యార్థులు డీటీ శంకర్‌కు వినతిపత్రం అందిస్తూ అనంతపురం జిల్లా నిత్యం కరువుకాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ధనార్జనే ద్యేయంగా పలు కార్పొరేట్‌, విద్యాసంస్థలు ఆనలైన తరగతులు కావాలంటే పెండింగ్‌ ఫీజులు చెల్లించాలని, పాఠ్యపుస్తకాల పేరుతో వేలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. విద్యాసంస్థలవారు పలు విద్యార్థులను, వారితల్లిదండ్రులకు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో ఆట స్థలం, లైబ్రేరి, సరిపడా మరుగుదొడ్లు, మౌళిక సదుపాయాలు లేకుండా ఫీజుల పేరుతో అనేక కోర్సుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-07-28T05:41:35+05:30 IST