ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
బిజినెస్
ఎడిటోరియల్
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ప్రవాస
క్రైమ్
రాశిఫలాలు
వంటలు
ePaper
Weekly
Sunday
ఎడ్యుకేషన్
సాహిత్యం
ప్రత్యేకం
ఫొటోలు
వీడియోలు
ఆరోగ్యం
ఓపెన్ హార్ట్
40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.
PH: 9390 999 999, 98481 97 222
Feb 24 2021 @ 00:44AM
హోం
ఆంధ్రప్రదేశ్
కర్నూలు
నేటినుంచి పోలీసులకు కొవిడ్ టీకా
6,279 మంది పోలీసుల గుర్తింపు
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ
కర్నూలు(హాస్పిటల్), ఫిబ్రవరి 23:
జిల్లాలో పోలీసులు, హోంగార్డులు, ఏపీఎస్సీ బెటాలియన్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బందికి బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 6,279 మంది పోలీసులు ఉన్నారన్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలతో పాటు ఏపీఎస్పీ బెటాలియన్, జిల్లా ఎస్పీ కార్యాలయం, కర్నూలు జీజీహెచ్‌లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, కొద్దిమందిలో మాత్రం ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చినా వెంటనే తగ్గిపోతాయని అన్నారు. మొదటి డోసు వేసుకున్న వారు 28 రోజుల వ్యవధిలో రెండో డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. హెల్త్‌కేర్ వర్కర్లకు కొవిడ్ టీకా మొదటి డోసు వేసుకోవడానికి ఫిబ్రవరి 25 వరకు గడువు ఉందన్నారు.
జీరో కేసులు
జిల్లాలో గత 24 గంటల్లో 1405 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో బాధితుల సంఖ్య 60,860కు చేరగా 13 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,358 మంది డిశ్చార్జి అయ్యారు.
876 మందికి టీకాలు
జిల్లాలో 2787 మంది హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు కొవిడ్ టీకాలు వేయాల్సి ఉండగా మంగళవారం 876 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
Advertisement
కర్నూలు
మరిన్ని...
Advertisement
ఆంధ్రప్రదేశ్
మరిన్ని...
ప్రవాస
మరిన్ని...
Advertisement