Taiwanలో రెండు భారీ భూకంపాలు

ABN , First Publish Date - 2022-03-23T13:22:23+05:30 IST

తైవాన్ దేశంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది....

Taiwanలో రెండు భారీ భూకంపాలు

తైపీ(తైవాన్): తైవాన్ దేశంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తైపీ నగరంలో బుధవారం తెల్లవారుజామున రెండు భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. బలమైన భూకంపం ఆగ్రేయ తైవాన్‌ను తాకింది. హువాలియన్ కౌంటీ భూకంప కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం 30.6 కిలోమీటర్ల లోతులో నమోదైంది.భూకంపం ప్రభావం టైటుంగ్ నగర సమీపంలో కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.తైవాన్ తరచూ భూకంపాలకు గురవుతోంది. హువాలియన్, టైటుంగ్ రెండు పర్వత ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉంది.


బుధవారం నాటి భూకంపం వల్ల ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. 2016వ సంవత్సరంలో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. 1999వ సంవత్సరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైంది. ఆ భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు.


Updated Date - 2022-03-23T13:22:23+05:30 IST