పలు రైళ్ల పాక్షిక రద్దు, దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-01-29T05:53:36+05:30 IST

ప్రీ-ఇంటర్‌లాకింగ్‌, నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల నిమిత్తం పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని పాక్షికంగా రద్దు చేసినట్లు గుంటూరు డివిజనల్‌ రైల్వే అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పలు రైళ్ల పాక్షిక రద్దు, దారి మళ్లింపు

గుంటూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రీ-ఇంటర్‌లాకింగ్‌, నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల నిమిత్తం పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని పాక్షికంగా రద్దు చేసినట్లు గుంటూరు డివిజనల్‌ రైల్వే అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం - యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫిబ్రవరి 4న, యశ్వంత్‌పూర్‌ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఫిబ్రవరి 5న ధర్మవరం - యశ్వంత్‌పూర్‌ మధ్యన రద్దు చేసినట్లు తెలిపారు. భువనేశ్వర్‌ - బెంగళూరు సిటీ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ని ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో సత్యసాయి ప్రశాంతి నిలయం - బెంగళూరు సిటీ మధ్యన రద్దు చేశామన్నారు. బెంగళూరు సిటీ - భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ని ఫ్రిబవరి 4, 5, 6, 7 తేదీల్లో సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరుతుందన్నారు. పూరీ - యశ్వంత్‌పూర్‌ గరీభ్‌రద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు రాకుండా విజయవాడ, గూడూరు, జోలార్‌పట్టి మీదగా యశ్వంత్‌పూర్‌ చేరుకొంటుంది. యశ్వంత్‌పూర్‌ - పూరీ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్రిబవరి 5వ తేదీన జోలార్‌పట్టి, గూడూరు, విజయవాడ మీదగా పూరీకి వెళుతుందన్నారు. 

ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు

నెంబరు. 07455 నరసపూర్‌ - సికింద్రాబాద్‌ ప్రతీ ఆదివారం గుంటూరు మీదగా నడిచే ప్రత్యేక రైలుని ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ నడుపుతామని రైల్వే అధికారి తెలిపారు. అలానే నెంబరు. 07456 సికింద్రాబాద్‌ - విజయవాడ ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ తిప్పుతామన్నారు.  


Updated Date - 2022-01-29T05:53:36+05:30 IST