కొవిడ్‌తో సీతానగరం తహశీల్దార్‌ శివమ్మ మృతి

ABN , First Publish Date - 2021-05-13T06:03:36+05:30 IST

కొవిడ్‌తో సీతానగరం తహశీల్దార్‌ ఎల్‌.శివమ్మ (46) మృతి చెందారు. కొవిడ్‌ బారిన పడిన ఈమె మూడు రోజులుగా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొవిడ్‌తో సీతానగరం తహశీల్దార్‌ శివమ్మ మృతి

సీతానగరం, మే 12: కొవిడ్‌తో సీతానగరం తహశీల్దార్‌  ఎల్‌.శివమ్మ (46) మృతి చెందారు. కొవిడ్‌ బారిన పడిన ఈమె మూడు రోజులుగా కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూశారు. రెండేళ్లుగా మండలంలో అంకితభావంతో పనిచేస్తున్న ఈమె విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందారు. శివమ్మకు భర్త, ఒక కుమారుడు, కుమార్తె వున్నారు. తహశీల్దారు కార్యాలయం వద్ద శివమ్మ చిత్రపటానికి వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సిబ్బంది. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆత్మ చైర్మన డాక్టరు బాబు, సహకార సంఘాల అధ్యక్షులు కొంచ చంద్రభాస్కరరావు, వడ్లమూరు సోమరాజు, టీడీపీ నాయకుడు గద్దే సురేష్‌ తదితరులు సంతాపం తెలిపారు.

కలెక్టర్‌, జేసీల సంతాపం 

డెయిరీఫారం సెంటర్‌ (కాకినాడ): సీతానగరం తహశీల్దార్‌ శివమ్మ మృతికి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సమర్ధ అధికారిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. శివమ్మ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివమ్మ మృతికి జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-05-13T06:03:36+05:30 IST