Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన 'శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచన పోటీ' విజేతల ప్రకటన

twitter-iconwatsapp-iconfb-icon
టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచన పోటీ విజేతల ప్రకటన

2022 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోని శాక్రమెంటో తెలుగు సంఘం(టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ”లో విజేతలను ప్రకటించారు. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, స్పెయిన్, ఐర్లండ్, గల్ఫ్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు పాల్గొన్నారు. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవలో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. అన్ని రచనలకు సర్వహక్కులు రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు 'సుజన రంజని' (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక 'సిరిమల్లె' (http://sirimalle.com), 'స్వర పత్రిక' (https://swara.media/magazines/), ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో 'తెలుగు వెలుగు' పత్రికలోనూ ప్రచురించబడతాయి.


ఉత్తమ కథానిక విభాగం విజేతలు..

1. ప్రథమ బహుమతి: 'సెల్యూట్' - తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా) ($116-రూ.8,655/- నగదు బహుమతి, ప్రశంసా పత్రం)

2. ద్వితీయ బహుమతి: 'ఋణం' - సాయి ప్రభాకర్ (ఫ్లోరిడా, అమెరికా) ($58-రూ.4327/- నగదు బహుమతి, ప్రశంసా పత్రం)

3. తృతీయ బహుమతి: 'ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు' - కె.మీరాబాయి (కాలిఫోర్నియా, అమెరికా) ($28-రూ.2089/-నగదు బహుమతి, ప్రశంసా పత్రం)


న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథానిక:

1. 'గొప్పామె ఉరఫ్ గొప్పాయన' - సౌమ్యవి.బి (కెనడా)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

1. 'దీపపు వెలుగు' - నరసింహ గరిమెళ్ళ (టెక్సాస్, అమెరికా)

2. 'అలెక్సా' - శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)  

3. 'బొడ్రాయి' - శ్రీధర్ రెడ్డి బిల్లా (కాలిఫోర్నియా, అమెరికా)

4. 'అక్షరాభ్యాసం' - సుగుణ వల్లి (కెనడా) 

5. 'మా అమ్మానాన్నల పెళ్లిరోజు' - రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)


ప్రశంసా పత్రం పొందినవారు:

1. 'గంభీరాలకే మరుదు' - లక్ష్మీ రాయవరపు (కెనడా) 

2. 'డిపార్చర్ గేటు' - పాణిని జన్నాభట్ల (మసాచుసెట్స్, అమెరికా)  

3. 'రక్షణ కవచం' - శేషా రత్నం పారుపుడి (టెక్సాస్, అమెరికా)


ఉత్తమ కవిత విభాగం విజేతలు:

1. ప్రథమ బహుమతి: 'ఆర్షజాతి' (పద్యఖండిక) -  శఠగోపన్ శ్రీవాత్సవ శేషం (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($116- రూ.8,655/-నగదు బహుమతి, ప్రశంసా పత్రం)

2. ద్వితీయ బహుమతి: 'నీరాజనం' - తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా)  ($58-రూ.4327/- నగదు బహుమతి, ప్రశంసా పత్రం)

3. తృతీయ బహుమతి: 'కంచె' - రఫీ మహమ్మద్ (దక్షిణాఫ్రికా) ($28-రూ.2089/- నగదు బహుమతి, ప్రశంసా పత్రం)


న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కవిత:

1. ఆటుపోట్లు - పొలిమేర మల్లేశ్వరరావు (టెక్సాస్, అమెరికా)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

1. 'నేను నాన్నని': గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా)

2. 'ఆకాశం': రాధికా నోరి (ఫ్లోరిడా, అమెరికా)

3. 'అన్వేషణ': శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)

4. 'అంతర్ముఖం': డా.సుదర్శన్ రాపోలు (లివర్మోర్, కాలిఫొర్నీయా, అమెరికా)

5. 'ఎటో వెళ్ళిపోయింది మనసు': శేషారత్నం పారుపూడి (టెక్సాస్, అమెరికా) 

6. 'నా దేశపు అభివృద్ధిని చూడాలనిపిస్తుంది': మల్లిఖర్జున రావు కొమర్నేని (ఒక్లహోమా, అమెరికా)  


ప్రశంసా పత్రం పొందినవారు:

1. 'ఊగిసలాట' - లక్ష్మీ రాయవరపు (కెనడా) 

2. 'కిటికీ' -  మోహన్ మణికంఠ ఉరిటి (స్పెయిన్) 

3. 'పలకరింపు' - యామిని రాజశేఖర్ కొల్లూరు (గల్ఫ్ - అబుధాబి)

4. 'ఎదురు చూపులు' - రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)  

5. 'సిపాయి' - రాజేష్ తోలేటి (ఇంగ్లండ్)

6. 'నేస్తం' - ఇందు నిట్ల (ఒంటారియో, కెనడా)


విజేతలందరికీ సాహిత్యాభినందనలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. టాగ్స్ ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారాలు అందజేసిన రమేష్ వడలికి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్‌తో సహా విదేశాలలో నివసిస్తున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈ-మెయిలు [email protected]కు పంపవచ్చును. ఇక “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” ఫలితాల సమాచారం https://tinyurl.com/TagsUanMurthy4thContestResults ఫేస్ బుక్ లింకులో సైతం ఉంచబడింది. శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక పూర్వ సంచికల కోసం http://sactelugu.org/tags-patrika/ లింక్ ద్వారా చూడవచ్చు.


శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

ఈ-మెయిల్: [email protected]

Telugu Association Of Greater Sacramento (TAGS)

Post Box: 1666

Folsom, CA-95763, USA

Website: http://sactelugu.org

Facebook: https://facebook.com/sacTelugu


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.