హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఇన్చార్జి సెక్రటరీ బోసురాజుతో మాణిక్కం ఠాగూర్ సమాచారం తెప్పించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈరోజు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ తీరును సమావేశంలో నిలదీసేందుకు జగ్గారెడ్డి రెడీ అయ్యారు.