ఎన్నారై డెస్క్: కాన్సాస్ నగర తెలుగు సంఘం( TAGKC) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. స్థానిక Blue Valley Northwest High Schoolలో ఏప్రిల్ 9న శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 600 మంది తెలుగు వారు పాల్గొన్న ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సంఘం కార్యక్రమాల విభాగ నాయకుడు విశేష్ రేపల్లె స్వాగత ఉపన్యాసం చేశారు. ఆ తర్వాత స్థానిక దేవాలయ పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా చిన్నారులు, కొందరు మహిళలు వారి నృత్యాలు, గాత్రాలతో సభకు వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా ముఖ్యంగా నిధి పాడిన పాటలతో అంతా తన్మయత్వం చెందారు.
వాయిద్యాలు లేకుండా కేవలం నోటితో మాత్రమే చేసిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు మధ్య మధ్యలో raffle tickets తీసి విజేతలకు బహుమానాలు అందచేశారు. కార్యక్రమంలో వ్యాఖ్యతలుగా వ్యవహరించిన నేహా రెడ్డి, నిధి రావు మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust Board Chair దుర్గ తెల్ల కొత్త కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారు. కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, దాతలకు, వచ్చిన ఆహూతులకు ధన్యవాదాలు తెలిపారు. చివరగా ఉపాధ్యక్షుడు నరేంద్ర దుదెల వందన సమర్పణ, జాతీయ గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి.
ఇవి కూడా చదవండి