Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 10 Jan 2022 00:19:47 IST

తగ్గేదేలా..

twitter-iconwatsapp-iconfb-icon
తగ్గేదేలా..కార్పొరేషన వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన (ఫైల్‌)

ప్రొబేషన తక్షణమే డిక్లేర్‌ చేయాలి

ప్రభుత్వ నిర్ణయంతో రేషనకార్డుల కోత 

పథకం ఏదైనా అమలు బాధ్యత మాదే 

మా పైన అంత నిర్లక్ష్యమా !

ఉద్యమ బాటలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 

జిల్లాలో 8270 మంది సిబ్బంది 

సమ్మె చేస్తే ప్రభుత్వ పథకాలపై ప్రభావం 

ముఖ్యమంత్రి వైఎ్‌స జగన మానస పుత్రికైన వలంటీర్‌ వ్యవస్థ ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు తెరలేపారు. విధుల్లో చేరిన ఏడాది లోపు ప్రొబేషన డిక్లేర్‌ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చి జూనకు పొడిగించడంతో సచివాలయ సిబ్బంది భగ్గుమంటున్నారు. అధికారులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అయ్యారు. జిల్లాలో 8270 మంది సచివాలయ ఉద్యోగులు పోరుబాటలో ఉన్నారు. ప్రొబేషనను వెంటనే డిక్లేర్‌ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల పోరుబాట అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు అధికార పార్టీ నేతల్లోనూ కలకలం రేపుతోంది. 


కడప, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎ్‌స జగనమోహనరెడ్డి పరిపాలనను ప్రజల వద్దకు చేర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. జిల్లాలో 635 గ్రామ సచివాలయాలు, 255 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో సెక్రటరీ, డిజిటల్‌ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ, అగ్రికల్చర్‌, పశు సంవర్థక శాఖ, ఏఎనఎం, మహిళా పోలీసులు పనిచేస్తుండగా వార్డు సచివాలయంలో అడ్మినిస్ట్రేషన సెక్రటరీ, శానిటేషన, ఎడ్యుకేషన, ప్లానింగ్‌, వార్డు, హెల్పర్‌, డెవల్‌పమెంట్‌, ఎనర్జీ, హెల్త్‌ సెక్రటరీ, మహిళా పోలీ్‌సతో పాటు మరికొంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి వేతనం రూ.15 వేలు, ఏడాది లోపు ప్రొబేషన డిక్లేర్‌ చేస్తానని సీఎం జగన ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 2న ప్రొబేషన ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రొబేషన ప్రకటన జాప్యం చేస్తూ జూనకు వాయిదా వేయడంతో సచివాలయ సిబ్బంది భగ్గుమన్నారు. వారి బాటలోనే జిల్లా ఉద్యోగులు కూడా పోరుబాట పట్టారు. ప్రభుత్వ పథకాలను మానిటరింగ్‌ చేసేందుకు ఆయా శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిరసనలో భాగంగా చాలామంది ఉద్యోగులు వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అయ్యారు.


సంక్షేమ పథకాలు దూరం 

ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేస్తున్నా దాని అమలు బాధ్యత సచివాలయ ఉద్యోగులపై పెట్టారు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని ఉద్యోగులే అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటు ప్రజలకు ఇటు అధికార యంత్రాంగానికి చేదోడుగా మారారు. ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మా భుజస్కంధాలపై వేశారు. అయితే మా శ్రమకు తగ్గట్లు గుర్తింపు వేతనం ఏదంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులమనే కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు దూరమయ్యాం. మాకు ఇచ్చేది జీతం రూ.15 వేలు, కుటుంబంలో తల్లిదండ్రి, తమ్ముళ్లు, ఉంటారు. అయితే మా ఉద్యోగాలు 

చూపించి రేషనకార్డులు తీసేశారు. విద్యాదీవెన, పించన, అమ్మఒడి, అసరా, పలు పథకాలకు దూరమయ్యాం. మావల్ల అర్హులై కూడా మా కుటుంబ సభ్యులు పథకాలకు దూరమయ్యారు. రేయనకా... పగలనకా... విధులు నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా విధులు నిర్వహించాం. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నాం. రెండేళ్ల క్రితం పెట్రోల్‌ రూ.70 ఉండేది. ఇప్పుడు సెంచరీ దాటిపోయింది. ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడం లేదు. ఎన్నో కష్టాలను పంటిబిగువున పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏడాది దాటినా కూడా ప్రొబేషన డిక్లేర్‌ చేయకుండా వాయిదా వేస్తారా అంటూ ఉద్యోగులు ఆవేదన  చెందుతున్నారు. 


ప్రభుత్వ పథకాలపై ప్రభావం

సచివాలయ సిబ్బంది నిరవధిక పోరుబాటలోకి వెళితే పలు పథకాల అమలుపై ప్రభావం పడుతుందని అధికారులు అంటున్నారు. ఓటీఎ్‌సను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత మంది లబ్ధిదారుల నుంచి రిజిస్ర్టేషనకు సొమ్ము వసూలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది పోరుబాటపడితే ఆ పథకంపై ప్రభావం చూపుతుంది. అలాగే కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోంది. నాలుగు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వ్యాక్సినేషన ముమ్మరం చేయడంతో పాటు ఫీవర్‌ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయ సిబ్బంది లేకుంటే నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. అలాగే పారిశుధ్యంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్తబండ్ల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీనిపై కూడా ప్రభావం చూపనుంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.