Abn logo
Oct 30 2020 @ 13:48PM

‘బాంబులు, తుపాకుల భాషలో చెబితేనే తాడిపత్రి ఎమ్మెల్యేకు అర్థమయ్యేది’

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాంబులు, తుపాకుల భాషలో చెబితే ఎమ్మెల్యేకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కానీ ఆ పద్ధతిని ప్రజలు హర్షించరని అన్నారు.  పరిశ్రమ వస్తుందన్న ఉద్దేశంతోనే రైతులు 950 ఎకరాల భూములిచ్చారన్న ఆయన..  భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యవహారాలు ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. తాడిపత్రి ఎమ్మెల్యేల ప్రవర్తించాలని, సలహాదారులను పెట్టుకొని నేర్చుకోవాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement