యాడికిలో యథేచ్ఛగా మట్టి దోపిడీ

ABN , First Publish Date - 2020-12-05T06:14:03+05:30 IST

మట్టి కోసం కొండలు, గుట్టలు, వంకల్లో యథేచ్ఛగా అక్రమార్కులు తవ్వకాలు చేపడుతు న్నారు.

యాడికిలో యథేచ్ఛగా మట్టి దోపిడీ
యాడికిలో మట్టి కోసం గుట్టను తవ్వుతున్న దృశ్యం

యాడికి, డిసెంబరు 4 : మట్టి కోసం కొండలు, గుట్టలు, వంకల్లో యథేచ్ఛగా  అక్రమార్కులు తవ్వకాలు చేపడుతు న్నారు. రియల్‌ ఎస్టేట్‌ భూములు చదును చేసుకోవడానికి, రహదారులు వేయడానికి మట్టి మాఫియా గ్యాంగ్‌ ట్రాక్టర్‌ మట్టిని రూ.500 నుంచి 600 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. ప్రధాన రహదారిపైనే యథేచ్ఛగా అక్రమంగా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నా  పట్టించుకొనేవారే లేకపోవడం గమనార్హం. కొండలు, గుట్టలు రోజురోజుకు తరిగిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తీ చూడకపోవడం విడ్డూరం. దీంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. నెల క్రితం మైనింగ్‌ అండ్‌ జియాలజి అధికారులు ఇలా మట్టిని తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లను సీజ్‌ చేసి సుమారు రూ. లక్ష వరకు జరిమానా విధించారు. అయినా ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.


Updated Date - 2020-12-05T06:14:03+05:30 IST