Abn logo
Mar 2 2021 @ 14:25PM

'ఆర్‌.ఎక్స్‌ 100' హిందీ వెర్షన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన అక్షయ్‌

2018లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది 'ఆర్‌.ఎక్స్‌ 100'. అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కార్తికేయ నటనకు మంచి పేరు, పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామర్‌కు చాలా మంచి క్రేజ్‌ దక్కింది. టాలీవుడ్‌లో హిట్‌ అయిన సినిమాలను రీమేక్‌ చేస్తున్న బాలీవుడ్‌ 'ఆర్‌.ఎక్స్‌100' చిత్రాన్ని 'తడప్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. సునీల్‌ శెట్టి తనయుడు అహన్‌ శెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తుంది. 

మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నదియద్‌వాలా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. "నీకిది చాలా గొప్ప రోజు అహన్‌. నీ తండ్రి సునీల్‌ శెట్టి తొలి చిత్రం బల్వాన్‌ పోస్టర్‌ను చూసిన రోజు నాకింకా గుర్తుంది. ఈరోజు నీ సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను విడుదల చేస్తున్నాను. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ లుక్‌లో చాలా బావున్నావు. వెండితెరపై త్వరలోనే చూడాలని అనుకుంటున్నాను. తడప్‌ సినిమా యూనిట్‌కు అభినందనలు" అని తెలిపారు అక్షయ్‌ కుమార్‌. 

Advertisement
Advertisement
Advertisement