టాకో ఆధ్వర్యంలో ఘనంగా ‘అక్షరమాల’ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-03-09T23:55:11+05:30 IST

సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వారు మార్చి 7,8 తేదీల్లో ‘అక్షరమాల’ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఈ

టాకో ఆధ్వర్యంలో ఘనంగా ‘అక్షరమాల’ కార్యక్రమం

ఒహాయో: సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వారు మార్చి 7,8 తేదీల్లో ‘అక్షరమాల’ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7న స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పోటీలు ప్రేక్షకులను అలరించాయి. పిల్లల కోసం ‘పదవినోదం’.. పెద్దల కోసం పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. 


కాగా.. మార్చి 8న ఓలంటంజి హ్యాట్స్ మిడిల్ స్కూల్‌లో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల విభాగంలో రాత పరీక్షలు, మౌఖికం, కథల పోటీలు.. పెద్దల విభాగంలో వక్తృత్వ, ఏకపాత్రాభినయం, కవితల పోటీలు నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, పెద్దవారు జాతీయ నాయకుల వేషధారణలో తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు.. తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ చేసిన ప్రద ప్రయోగం ప్రశంసనీయంగా ఉంది. అనంతరం పోటీల్లో అత్యద్భుత ప్రతిభ కనబర్చిన వారి పేర్లను కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు. 




టాకో వారు అమ్మ భాషకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుంటారు. దీంతో వీరు నిర్వహించిన ‘అక్షరమాల-2020’లో సుమారు 150 మంది పిల్లలు, 50 మందికిపైగా పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత ఉపాధ్యాయులు, తెలుగు భాషా సేవకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘టోకో-ఉగాది’ వేడుకల రోజున విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరమాల-2020’ కార్యక్రమంలో అనిత ఎగిగెళ్ల, సుష్మా వద్దే, శ్రీలక్షీ గడిపర్తి, నీలిమ యలమంచలి, కళీ ప్రసాద్ మావులేటి, ఉషా శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర, సుధీర్ కనగాల, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, అపర్ణ దండమూడి, అన్వేష్ పెండ్యాల, చిరంజీవి సమ్మెట, రమ ప్రత్తిపాటి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-09T23:55:11+05:30 IST