కెనడాలో ఘనంగా 'తాకా' వారి సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-19T15:33:06+05:30 IST

కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్) నందు తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) వారు జనవరి 15న(శనివారం) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

కెనడాలో ఘనంగా 'తాకా' వారి సంక్రాంతి సంబరాలు

టొరంటో: కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్) నందు తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) వారు జనవరి 15న(శనివారం) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, రేణు కుందెమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


మొదట తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి కార్యక్రమాన్నిజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం కల్పనా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్-19 కష్ట కాలంలోనూ 'తాకా' చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాల గురించి వివరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 20కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులుతో దాదాపు 4 గంటల పాటు ఉల్లాసంగా కార్యక్రమం జరిగింది.


ప్రతి యేటా తాకా వారు ఆనవాయితీ ప్రకారం టొరంటో కాలమానంలో ప్రచురించిన తెలుగు క్యాలెండర్‌ను సంక్రాంతి పండుగ నాడు ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలకు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్ ముద్రణకు సహకరించి, టొరంటోకు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటి, ప్రసన్న తిరుచిరాపల్లికి కల్పనా మోటూరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాకా ప్రస్తుత కార్యవర్గం.. 2019-2021 మాజీ కార్యవర్గపు సభ్యులను, వారి చేసిన కృషికి గుర్తింపుగా మెమెంటోలతో సత్కరించారు.


ఈ కార్యక్రమ విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల, రాణి మద్దెల, ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని అధ్యక్షులు కల్పనా మోటూరి అభినందించారు. 


అనంతరం కెనడా, భారత దేశ భక్తి గీతాలు అలపించడం జరిగింది. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధాన దాత Get Home Realty వారికి, ఇతర దాతలకు, వీక్షించిన అతిధులకు తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి వందన సమర్పణతో కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు.









Updated Date - 2022-01-19T15:33:06+05:30 IST