జమాత్ రోగుల అనుచిత ప్రవర్తనపై వైద్యకళాశాల డాక్టర్ మరో ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-04-04T17:09:10+05:30 IST

కరోనా అనుమానిత లక్షణాలతో కాన్పూర్ వైద్యకశాళాల ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ సభ్యులు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ....

జమాత్ రోగుల అనుచిత ప్రవర్తనపై వైద్యకళాశాల డాక్టర్ మరో ఫిర్యాదు

ఆసుపత్రిలో తబ్లిగ్ జమాత్ రోగులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు...

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరోనా అనుమానిత లక్షణాలతో కాన్పూర్ వైద్యకశాళాల ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ సభ్యులు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆ వైద్యకళాశాల ప్రిన్సిపాల్, డీన్ శనివారం ఫిర్యాదు చేశారు. ఢిల్లీ  మర్కజ్ సమావేశానికి  వెళ్లి వచ్చిన 22 మంది జమాత్ సభ్యులను కరోనా అనుమానంతో వారిని కాన్పూర్ లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ వైద్యకళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి క్వారంటైన్ లో ఉండాల్సిన 22 మంది సభ్యులు ఆసుపత్రిలోనే ఉమ్మి వేస్తూ వైద్యబందం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని వైద్యకళాశాల ప్రిన్సిపాల్, డీన్ డాక్టర్ ఆరతి దేవి లాల్ చందానీ ఆరోపించారు.


సామాజిక దూరం పాటించాలని కోరినా దానిని ఉల్లంఘించి క్వారంటైన్ లో ఉండటం లేదని డాక్టర్ ఆరతిదేవి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి వైద్యబృందం పట్ల జమాత్ సభ్యుల ప్రవర్తన సరిగా లేదని, వారు తమ వైద్య బృందం పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, క్వారంటైన్ నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారని డాక్టర్ ఆరతిదేవీ ఫిర్యాదు చేశారు. ఘజియాబాద్ నగరంలోని ఆసుపత్రిలో చేరిన ఐదుగురు జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన మరవక ముందే కాన్పూర్ నగరంలోని వైద్యకళాశాలలోనూ జమాత్ సభ్యులపై డాక్టర్లు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. 

Updated Date - 2020-04-04T17:09:10+05:30 IST