Abn logo
Jul 8 2020 @ 10:32AM

నా చెయ్యి పట్టుకుని నడిపించావు: మంచు లక్ష్మికి తాప్సీ థ్యాంక్స్

మంచు లక్ష్మి నిర్మించిన `ఝుమ్మంది నాదం` సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది హీరోయిన్ తాప్సీ. రాఘవేంద్రరావు రూపొందించిన ఆ చిత్రంతో తాప్సీ గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చి మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 


తాజాగా తాప్సీ నటించిన `తప్పడ్` సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ నటనను అందరూ అభినందించారు. తాజాగా మంచు లక్ష్మి కూడా `తప్పడ్` సినిమా చూసి తాప్సీని అభినందించింది. దీనికి తాప్సీ స్పందిస్తూ.. `అబ్బా.. పది సంవత్సరాలు.. నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపించడం దగ్గర్నుంచి.. నిన్ను గర్వపడేలా చేసిన క్షణం వరకు.. ఓ సర్కిల్ పూర్తయినట్టు అనిపిస్తోంది. చాలా సంతోషకర ప్రయాణం. నీ ప్రశంస నాకు అన్నింటికంటే చాలా విలువైనది. బిగ్ హగ్` అంటూ రిప్లై ఇచ్చింది. 



Advertisement
Advertisement
Advertisement