Abn logo
Jan 20 2021 @ 19:19PM

అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా: తాప్సీ

ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని, కెరీర్‌లో ఆశించిన స్థాయికి చేరుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని హీరోయిన్ తాప్సీ చెప్పింది. ప్రస్తుతం `రష్మీ రాకెట్` షూటింగ్‌లో పాల్గొంటున్న తాప్సీ తన కెరీర్, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. 


`నేనెప్పుడూ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను వేర్వేరుగానే చూస్తాను. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెబుతుంటాను. మథియాస్‌ బో బర్త్‌డేకు కూడా అలాగే చేస్తాను. ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నా. కెరీర్‌లో ఆశించిన స్థాయికి చేరుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌`ని తాప్సీ చెప్పింది. 

Advertisement
Advertisement
Advertisement