దుబాయిలో TA, ETCA ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-06T19:14:09+05:30 IST

బతుకమ్మ తెలంగాణ పండుగ అయినా సంస్కృతి, ఆచార వ్యవహారాల పరస్పర ఆకర్షణ కారణంగా ప్రవాసంలో ఏ ప్రాంతం వారు అయినా ఎందుకు దూరంగా ఉంటారు, ఎందుకు ఉండాలి కూడా.

దుబాయిలో TA, ETCA ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

ఆంధ్ర తెలంగాణ ప్రవాసుల అపూర్వ కలయిక

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బతుకమ్మ తెలంగాణ పండుగ అయినా సంస్కృతి, ఆచార వ్యవహారాల పరస్పర ఆకర్షణ కారణంగా ప్రవాసంలో ఏ ప్రాంతం వారు అయినా ఎందుకు దూరంగా ఉంటారు, ఎందుకు ఉండాలి కూడా. అటు కళింగాంధ్రన నాగవళి నదీ తీరానికి చెందిన వక్కలగడ్డ వెంకట సురేశ్ నుండి మోదలు ఇటు ఉత్తర తెలంగాణన మానేరు నదీ పరివాహాక ప్రాంతానికి రాధాపు సత్యం నుండి మోదలు వరకు కలిసికట్టుగా చేసిందే బతుకమ్మ. దుబాయి తెలుగు అసోసియేషన్ , ఏమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలు ఈ నూతన కలయికకు వేదికగా మారాయి. ఆజ్మాన్ లోని ఇండియన్ అసోసియెషన్ సమావేశ మందిరంలో ఈ రెండు ప్రవాసీ సంఘాలు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు అనేక మంది తెలుగు ప్రవాసీ కుటుంబాలను అలరించాయి. గాయిని తేలు విజయ పాడిన బతుకమ్మ పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. 


చిన్నపిల్లలు సైతం సాంప్రదాయ దుస్తుల్లో 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అంటూ చప్పట్లతో హుషురూగా ఆడిపాడటం అందరిని ఆకట్టుకొన్నాయి. ప్రభుత్వ గుర్తింపుతో తెలుగు అసోసియేషన్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ETCA, జాగృతి యూఏఈ విభాగంతో కలిసి బతుకమ్మ పండుగను నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి సాంస్కృతిక పరమైన వేడుకలు భావితరాలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయడానికి దోహదపడుతాయని తెలిపారు. తమ జీవితంలో ప్రప్రథమంగా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గోనడం అమిత ఆనందాన్ని కల్గించిందని దుబాయిలో నివాసం ఉండే తిరుపతికి చెందిన తనుజా, విశాఖపట్టణానికి చెందిన శోభరాణి, శైలజా, లావణ్యలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ETCA, తెలుగు అసోసియేషన్ మహిళా సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, బతుకమ్మ కోలాటాలు, జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెళ్లి రావమ్మ బతుకమ్మ అంటూ గౌరమ్మను తలుస్తూ బతుకమ్మలను ఏర్పాటు చేసిన కొలనులో నిమ్మజనం చేశారు.


ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన ట్రైకలర్స్ ప్రాపర్టీస్, ఎల్.ఎస్..పి.ఎమ్.కె గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బి.ఎస్.ఆర్ సెక్యూరిటీస్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, ట్రాన్స్ ఏషియా పైప్ లైన్ సర్వీసెస్, సేఫ్ యార్డ్స్ ఇన్‌లకు నిర్వాహకులు బతుకమ్మ జ్ఞాపికను అందజేశారు. ETCA అధ్యక్షులు సత్యం రాధారపు, ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర, మహిళ విభాగ ఇంఛార్జ్ అల్లూరి సరోజ, తెలుగు అసోసియేషన్ చైర్మన్ దినేశ్ కుమార్ వుగ్గిన, జనరల్ సెక్రెటరీ వివేకానంద్ బలుస, కల్చరల్ డైరెక్టర్ వక్కలగడ్డ వెంకట సురేష్, వైస్ చైర్మన్ మసివుద్దిన్, తెలంగాణ జాగృతి యూఏఈ అధ్యక్ష్యులు వెంకటేశ్వర్ రావు పీచర, ఉపాధ్యక్ష్యులు అరె శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాణి కోట్ల, కటకం సాయిచందర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-06T19:14:09+05:30 IST