విండీస్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2021-10-24T08:43:46+05:30 IST

డిఫెండింగ్‌ చాంప్‌ వెస్టిండీస్‌.. హారర్‌ బ్యాటింగ్‌ షోతో టీ20 వరల్డ్‌క్‌పను ప్రారంభించింది. స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ కరీబియన్ల వెన్ను విరవడంతో..

విండీస్‌ ఢమాల్‌

తిప్పేసిన రషీద్‌, మొయిన్‌ 

55 రన్స్‌కే ఆలౌట్‌

టీమ్‌ నిండా టీ20 స్పెషలిస్ట్‌లే.. ఒంటి చేత్తో మ్యాచ్‌ 


టీ20 వరల్డ్‌కప్‌లో మూడో అత్యల్ప స్కోరు 55 పరుగులు చేసిన టీమ్‌గా విండీస్‌. గతంలో నెదర్లాండ్స్‌ 39, 44 పరుగులతో తొలి రెండు స్థానాల్లో నిలిచింది. కాగా, టీ20ల్లో కరీబియన్లకు ఇది రెండో అత్యల్పం. 2019లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విండీస్‌ 45 రన్స్‌కే కుప్పకూలింది. 


స్వరూపాన్నే మార్చేయగలిగే భారీ హిట్టర్లు.. కానీ, అనాలోచిత షాట్లు.. పేలవ బ్యాటింగ్‌తో.. డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పొట్టి వరల్డ్‌క్‌పను దారుణ ఓటమితో ఆరంభించింది. 


దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంప్‌ వెస్టిండీస్‌.. హారర్‌ బ్యాటింగ్‌ షోతో టీ20 వరల్డ్‌క్‌పను ప్రారంభించింది. స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ కరీబియన్ల వెన్ను విరవడంతో.. గ్రూప్‌-1లో శనివారం ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో విండీస్‌ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందనుకుంటే.. విండీస్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో వార్‌ వన్‌ సైడైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 14.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. గేల్‌ (13) ఒక్కడే డబుల్‌ డిజిట్‌ స్కోరు సాధించాడు. మొయిన్‌ (2/17), మిల్స్‌ (2/17) చెరో రెండు వికెట్లతో అదరగొట్టగా.. 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన రషీద్‌ (2.2-0-2-4) విండీస్‌ మిడిల్‌, లోయరార్డర్‌ పతనాన్ని శాసించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 8.2 ఓవర్లలో 56/4 స్కోరుతో సులువుగా ఛేదించింది. ఓపెనర్‌ బట్లర్‌ (24 నాటౌట్‌) జట్టును గెలిపించాడు. స్పిన్నర్‌ హుసేన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. మొయిన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 


స్కోరుబోర్డు

వెస్టిండీస్‌:


సిమన్స్‌ (సి) లివింగ్‌స్టోన్‌  (బి) మొయిన్‌ 3, లూయిస్‌ (సి) మొయిన్‌ (బి) వోక్స్‌ 6, గేల్‌ (సి) మలన్‌ (బి) మిల్స్‌ 13, హెట్‌మయర్‌ (సి) మోర్గాన్‌ (బి) మొయిన్‌ 9, బ్రావో (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 5, పూరన్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 1, పొలార్డ్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 6, రస్సెల్‌ (బి) రషీద్‌ 0, హుసేన్‌ (నాటౌట్‌) 6, మెకాయ్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 0,  రాంపాల్‌ (బి) రషీద్‌ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 14.2 ఓవర్లలో 55 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-8, 2-9, 3-27, 4-31, 5-37, 6-42, 7-44, 8-49, 9-49; బౌలింగ్‌: మొయిన్‌ 4-1-17-2, వోక్స్‌ 2-0-12-1, మిల్స్‌ 4-0-17-2, జోర్డాన్‌ 2-0-7-1, రషీద్‌ 2.2-0-2-4. 


ఇంగ్లండ్‌:

రాయ్‌ (సి) గేల్‌ (బి) రాంపాల్‌ 11, బట్లర్‌ (నాటౌట్‌) 24, బెయిర్‌స్టో (సి అండ్‌ బి) హుసేన్‌ 9, మొయిన్‌ (రనౌట్‌/లూయిస్‌) 3, లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) హుసేన్‌ 1, మోర్గాన్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 8.2 ఓవర్లలో 56/4; వికెట్ల పతనం: 1-21, 2-30, 3-36, 4-39; బౌలింగ్‌: హుసేన్‌ 4-0-24-2, రాంపాల్‌ 2-0-14-1, మెకాయ్‌ 2-0-12-0, పొలార్డ్‌ 0.2-0-6-0. 

Updated Date - 2021-10-24T08:43:46+05:30 IST