మూడో టైటిల్‌పై విండీస్‌ కన్ను

ABN , First Publish Date - 2021-10-23T07:52:01+05:30 IST

అర్హత మ్యాచ్‌లు ముగియడంతో నేటి (శనివారం) నుంచి టీ20 ప్రపంచకప్‌ కోసం సూపర్‌-12 రౌండ్‌ ఆరంభం కాబోతోంది.

మూడో టైటిల్‌పై విండీస్‌ కన్ను

ప్రతీకారం కోసం ఇంగ్లండ్‌

రాత్రి 7.30 గం.

 స్టార్‌ స్పోర్ట్స్‌లో

దుబాయ్‌: అర్హత మ్యాచ్‌లు ముగియడంతో నేటి (శనివారం) నుంచి టీ20 ప్రపంచకప్‌ కోసం సూపర్‌-12 రౌండ్‌ ఆరంభం కాబోతోంది. గ్రూప్‌ 2లో తొలి రోజు రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన అనుభవంతో పాటు ప్రస్తుత టైటిల్‌ను కాపాడుకునే విషయంలో విండీ్‌సకు ఆరంభ మ్యాచ్‌లోనే కఠిన సవాల్‌ ఎదురుకాబోతోంది. దీనికి తోడు అఫ్ఘాన్‌, పాక్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో విండీస్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. జట్టులో విధ్వంసకర ఆటగాళ్లకు కొదువ లేకపోయినా ఆటతీరు మాత్రం ఆ స్ధాయికి తగ్గట్టుగా లేదు. సిమ్మన్స్‌, లూయిస్‌, పూరన్‌, హెట్‌మయెర్‌ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. చివర్లో పొలార్డ్‌ మెరుపులు జట్టుకు లాభించనున్నాయి. గేల్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. 


ఫేవరెట్‌ ఇంగ్లండ్‌:

చివరి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో విండీస్‌ చేతిలో ఎదురైన ఓటమికి ఇంగ్లండ్‌ బదులు తీర్చుకోవాలనుకుంటోంది. ఈసారి బెన్‌ స్టోక్స్‌, ఆర్చర్‌, సామ్‌ కర్రాన్‌ లేకపోయినా జట్టు సమతూకంతో కనిపిస్తోంది. జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, బట్లర్‌ తమదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా చీల్చి చెండాడగలరు. కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌ మాత్రమే ఆందోళనగా ఉంది. మొయిన్‌ అలీ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. తొలి వామ్‌పలో భారత్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌ వెంటనే పుంజుకుని కివీ్‌సపై గెలిచింది. బౌలింగ్‌లో మార్క్‌ఉడ్‌, ఆదిల్‌ రషీద్‌, విల్లే, వోక్స్‌, అలీ కీలకం కానున్నారు.


పిచ్‌:

దుబాయ్‌ గ్రౌండ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. దీంతో భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. ఛేజింగ్‌ జట్టుకు విజయావకాశం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశముంది.


 టీ20 ప్రపంచకప్‌ల్లో విండీస్‌తో తలపడిన ఐదుసార్లూ ఇంగ్లండ్‌ ఓడిపోయింది.

జట్లు (అంచనా)

విండీస్‌: సిమ్మన్స్‌, లూయిస్‌, గేల్‌, హెట్‌మయెర్‌, పూరన్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), రస్సెల్‌, చేజ్‌/హోసెన్‌, బ్రావో, మెక్‌కాయ్‌, వాల్ష్‌.

ఇంగ్లండ్‌: బట్లర్‌, రాయ్‌, మలాన్‌, బెయిర్‌స్టో, మోర్గాన్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, విల్లే, రషీద్‌, ఉడ్‌, వోక్స్‌/జోర్డాన్‌.

Updated Date - 2021-10-23T07:52:01+05:30 IST