బంగ్లాకు షాక్‌

ABN , First Publish Date - 2021-10-18T08:01:08+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ క్రిస్‌ గ్రీవ్స్‌ (45, 2/19) ఆల్‌రౌండ్‌ షోతో.. ఆదివారం గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 6 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది.

బంగ్లాకు షాక్‌

 6 పరుగులతో స్కాట్లాండ్‌ గెలుపు

 టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌


అల్‌ అమీరట్‌ (ఒమన్‌): టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ క్రిస్‌ గ్రీవ్స్‌ (45, 2/19) ఆల్‌రౌండ్‌ షోతో.. ఆదివారం గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 6 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. 141 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 134/7 పరుగులు మాత్రమే చేసింది. షకీబల్‌ (20), ముష్ఫికర్‌ (38)ను వరుస ఓవర్లలో అవుట్‌ చేసిన గ్రీవ్స్‌ కోలుకోలేని దెబ్బకొట్టాడు. బ్రాడ్‌ వీల్‌ (3/24) మూడు వికెట్లు పడగొట్టాడు. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 140/9 స్కోరు చేసింది. ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (29), మాథ్యూ క్రాస్‌ (11) రెండో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. బెర్రింగ్టన్‌ (2), మైకేల్‌ లీస్క్‌ (0)ను షకీబల్‌ ఒకే ఓవర్‌లో వెనక్కిపంపాడు. 8 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 53/6తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో గ్రీవ్స్‌, వాట్‌ (22) 7వ వికెట్‌కు 51 పరుగులు చేశారు. 


సంక్షిప్త స్కోర్లు;

స్కాట్లాండ్‌:

20 ఓవర్లలో 140/9 (గ్రీవ్స్‌ 45, వాట్‌ 22; మెహ్దీహసన్‌ 3/19, షకీబల్‌ 2/17). బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 134/7 (ముష్ఫికర్‌ 38,  మహ్మదుల్లా 23; వీల్‌ 3/24, గ్రీవ్స్‌ 2/19)


అదరగొట్టిన జతిందర్‌

గ్రూప్‌-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో ఒమన్‌ 10 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)ను చిత్తు చేసింది. ఓపెనర్లు జతిందర్‌ సింగ్‌ (73), ఆకిబ్‌ లియాస్‌ (50) అదరగొట్టడంతో.. పీఎన్‌జీ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఒమన్‌ 13.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌ (4/20) స్పిన్‌ మాయాజాలంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పీఎన్‌జీ 129/9 పరుగులకే పరిమితమైంది.


నేటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు

ఐర్లాండ్‌ గీనెదర్లాండ్స్‌ (మ.3.30)

శ్రీలంకగీనమీబియా (రాత్రి 7.30)


టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 108 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షకీబల్‌ రికార్డులకెక్కాడు. బెర్రింగ్టన్‌, మైకేల్‌ లీస్క్‌ను అవుట్‌ చేసిన షకీబల్‌.. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ (107)ను అధిగమించాడు. 

అత్యధిక వికెట్ల కెప్టెన్‌గా మక్సూద్‌ 

నాలుగు వికెట్ల (4-20)తో ప్రత్యర్థి బ్యాటింగ్‌ వెన్ను విరిచిన ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ వెటోరి ప్రపంచ రికార్డును సమం చేశాడు. పొట్టి వరల్డ్‌క్‌పలో కెప్టెన్‌గా ఇదే అత్యుత్తమ బౌలింగ్‌.

Updated Date - 2021-10-18T08:01:08+05:30 IST