పొట్టి కప్పునకు మనోళ్ల కొత్త జెర్సీ ఇదే..

ABN , First Publish Date - 2021-10-14T09:05:21+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు అధికారిక జెర్సీని బుధవారం ఆవిష్కరించారు. పర్షియన్‌ బ్లూ, రాయల్‌ బ్లూ షేడ్స్‌లో రూపొందించిన టీషర్ట్‌ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా పిలిచే కొత్త టీషర్టులు ధరించిన కోహ్లీ, బుమ్రా,

పొట్టి కప్పునకు మనోళ్ల కొత్త జెర్సీ ఇదే..

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు అధికారిక జెర్సీని బుధవారం ఆవిష్కరించారు. పర్షియన్‌ బ్లూ, రాయల్‌ బ్లూ షేడ్స్‌లో రూపొందించిన టీషర్ట్‌ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా పిలిచే కొత్త టీషర్టులు ధరించిన కోహ్లీ, బుమ్రా, రోహిత్‌, జడేజా, రాహుల్‌ ఫొటోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల స్ఫూర్తితో ఈ టీ-షర్ట్‌ను రూపొందించినట్టు కిట్‌ స్పాన్సరర్‌ ఎంపీఎల్‌ తెలిపింది. ‘ఓ జెర్సీ అభిమానులను గుర్తుకు తేవడం భారత క్రికెట్‌ చర్రితలో ఇదే మొదటిసారి. చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో ఫ్యాన్స్‌ చేసిన సందడి, సంతోషాన్ని ధ్వని తరంగాలుగా మార్చి జెర్సీపై ముద్రించాం’ అని ఎంపీఎల్‌ పేర్కొంది. 

Updated Date - 2021-10-14T09:05:21+05:30 IST