అబుదాభి: కివీస్‌తో జరుగుతున్న T20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు 3వ వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్‌లో రెండవ బంతికి మలన్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌథీ బౌలింగ్‌లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మలన్ స్థానంలో లివింగ్ స్టోన్ బ్యాటింగ్ చేపట్టాడు. మలన్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు 116 పరుగులు చేసింది. మరో ఆటగాడు మొయిన్ అలీ 26 పరుగుల వద్ద క్రీజులో ఉన్నాడు.