టీ20 టోర్నీ విజేత హైదరాబాద్‌ జెయింట్స్‌

ABN , First Publish Date - 2021-01-16T05:38:15+05:30 IST

మండలంలోని కొండమంజులూరులో జరుగుతున్న దక్షిణ భారత స్థాయి టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జేపీజీ జెయింట్స్‌ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై ఎంఆర్‌సీ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు భారీగా రావడంతో కొండమంజులూరులో కోలాహలం నెలకొంది.

టీ20 టోర్నీ విజేత  హైదరాబాద్‌ జెయింట్స్‌
టీ20 క్రికెట్‌ విజేత జెయింట్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బహుమతి అందిస్తున్న కృష్ణచైతన్య.

 కొండమంజులూరులో ముగిసిన దక్షిణ భారత స్థాయి పోటీలు

ఫైనల్‌ను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు 


పంగులూరు, జనవరి 15 : మండలంలోని కొండమంజులూరులో జరుగుతున్న దక్షిణ భారత స్థాయి టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జేపీజీ జెయింట్స్‌ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై ఎంఆర్‌సీ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు భారీగా రావడంతో కొండమంజులూరులో కోలాహలం నెలకొంది. 

ఫైనల్‌ పోరులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 15.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ఎమ్మార్సీ చెన్నై జట్టు రన్నర్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒంగోలు అరుణా ఇన్‌ఫ్రా జట్టు తృతీయ, చిలకలూరిపేట టైలర్స్‌ జట్టు నాలుగో స్థానం దక్కించుకున్నాయి.  ఫైనల్స్‌ అనంతరం విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2లక్షల నగదు బహుమతితోపాటు షీల్డ్‌ను వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణ చైతన్య అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన చెన్నై జట్టుకు రూ. 1.50లక్షల నగదును మహమ్మద్‌ రషీద్‌ ప్రదానం చేశారు. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్‌ ఫాకత్‌, కీపర్‌, ఫీల్డర్‌గా తరుణ్‌తేజ, మురళి, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అవినాష్‌లు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ముగింపు సభలో కృష్ణచైతన్య మాట్లాడుతూ గ్రామంలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన స్వామి, వెంకన్నబాబు, గ్రామస్థులను అభినందించారు. కార్యక్రమంలో మహమ్మద్‌బుడే, రషీద్‌, ఎంఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, జంపని రవిబాబు, ఎర్రం శ్రీనివాసరెడ్డి, మురళి, కొలకూరి నాగేశ్వరరావు, ఆర్‌.వి.సుబ్బారావు, పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-16T05:38:15+05:30 IST