హైదరాబాద్: ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఏపీ సీఐడీ నడుస్తోందని టీ టీడీపీ అధ్యక్షుడు నరసింహులు అన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఇంటికి దొంగల్లా అర్ధరాత్రి వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. దొంగ డాక్యుమెంట్లు పట్టుకొచ్చి లక్ష్మీనారాయణ ఇంట్లో దొరికినట్లు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఐడీ తీరు బాధాకరమన్నారు.