డిజిటల్‌ బోధనలపై విద్యార్ధులకు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-09-25T22:23:59+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల కోసం ప్రసారం చేస్తున్న డిజిటల్‌ బోధనలపై శనివారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్ల సీఈవో శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

డిజిటల్‌ బోధనలపై విద్యార్ధులకు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల కోసం ప్రసారం చేస్తున్న డిజిటల్‌ బోధనలపై శనివారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్ల సీఈవో శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు టీ-సాట్‌ నిపుణ ఛానల్‌లో ప్రారంభమయ్యే ఫోన్‌ ఇన్‌ లైవ్‌ కార్యక్రమంలో సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు గంటల పాటు జరిగే ప్రత్యేక ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 11 గంటల నుంచి 11.30గటల వరకు మాఽ్యధమెటిక్స్‌ ఉపాధ్యాయుడు, 11.30గంటల నుంచి 12 గంటల వరకు ఫిజిక్స్‌, 12గంటల నుంచి 12.30గంటల వరకు బయోసైన్స్‌, 12.30గంటల నుంచి 1గంట వరకు సోషల్‌ స్టడీస్‌కు సంబంధించిన సందేహాలను విద్యార్ధులు నివృత్తి చేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయుఉలు అందుబాటులో ఉంటారని తెలిపారు. 


తెలంగాణలోని ఉన్న పాఠశాలలకు సంబంధించి 8, 0, 10 తరగతులకు చెందిన విద్యార్ధులు ప్రతి శనివారం టీ-సాట్‌ స్టూడియోలో అందుబాటులో ఉండేమూడు ఉపాధ్యాయ బృందాల ద్వారా సబ్జెక్టుల వారీగా ఉత్పన్నమయ్యే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఎన్సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం వారాంతంలోని రెండవ శనివారం, 


ప్రభుత్వ సెలవులు మినహా అన్ని శనివారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఈవో ప్రకటించారు. టీ-సాట్‌ నిపుణ చానల్‌తో పాటు టీ-సాట్‌ యూట్యూబ్‌లోనూ లైవ్‌ అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్ధులు టోల్‌ ఫ్రీ నెంబర్లు 040-23540326, 18004254039 నెంబర్లకు కాల్‌చేసి సబె ్జక్టులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-25T22:23:59+05:30 IST